ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ఎన్నికల ప్రచారాన్ని కమిటీ సభ్యులు ప్రారంభించారు. రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు గడుస్తున్నా.. నిరుద్యోగుల, ఉద్యోగుల ఆశలను పూర్తిగా తుంగలో తొక్కినట్లు ఆరోపించారు. తెలంగాణ ప్రజలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థుల తరఫున సమస్యలపై శాసనమండలిలో గొంతు వినిపించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ఎన్నికల బరిలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో టీజేఏసీ - graduate mlc elections in telangana
ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని టీజేఏసీ నిర్ణయించింది. యాదాద్రి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. పట్టభద్రులు అందరూ ఏకమై డాక్టర్ గుప్తా రవీందర్ రెడ్డిని గెలిపించాలని టీజేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం కోరారు.
సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్సీ అభ్యర్థి తన వంతు పాత్ర నిర్వహిస్తారని వివరించారు. పట్టభద్రులు అందరూ ఏకమై డాక్టర్ గుప్తా రవీందర్ రెడ్డిని గెలిపించాలని టీజేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం కోరారు. ఈ సమావేశంలో యాదాద్రి టీజేఏసీ ఛైర్మన్ భువనగిరి శ్రీనివాస్, టీజేఏసీ కో ఆర్డినేటర్ వేణు, హైదరాబాద్ జిల్లా జేఏసీ ఛైర్మన్ శ్రీరామ్ శివ కుమార్, టీజేఏసీ గ్రేటర్ హైదరాబాద్ కో ఆర్డినేటర్ సత్యం, మేడ్చల్ జిల్లా టీజేఏసీ కో ఛైర్మన్ కెవి. నాగమయ్య తదితరులు పాల్గొన్నారు.