ఒక్క మాట కూడా
అమ్మ నీది ఎంత పెద్ద మనసు..
నవమాసాలు మోసింది. రక్తాన్ని పాలుగా ఇచ్చింది. కొడుకులు ఏడిస్తే తానూ ఏడ్చింది. కొడుకులు నవ్వితే తానూ నవ్వింది. కొడుకులే ప్రపంచం అనుకుంది. కొడుకుల ఆనందమే తన ఆనందంగా బతికింది. పెంచింది, పెద్ద చేసింది. తన కుమారులకు ఎలాంటి కష్టం రాకూడదని ఆస్తి సంపాదించి ఇచ్చింది. ఎప్పుడూ కొడుకుల క్షేమమే కోరుకుంది. ఇంటి నుంచి గెంటేసినా తన కొడుకులు బాగుండాలని తపిస్తోంది ఆ మాతృమూర్తి హృదయం. ఐదు రోజులుగా చెట్టు కిందే అభాగ్యురాలిగా జీవిస్తోంది ఆ తల్లి.
లక్షమ్మకు ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. 25 ఏళ్ల క్రితం ఆమె భర్త మరణించాడు. ఆ తర్వాత కొన్నాళ్ల వరకు పిల్లల వద్దే ఉంటూ ఇంటి పనిచేసింది. ఆ తర్వాత కుమారులు నెలకు ఒక్కరు పోషించేలా పెద్దలు ఒప్పందం చేశారు. నాలుగు రోజులు క్రితం రెండో కొడుకు భార్య.. అత్త లక్షమ్మను ఇంటి నుంచి గెంటేసింది. అప్పటి నుంచి ఒక చెట్టు నీడన ఆశ్రయం పొందుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు లక్ష్మమ్మ కుమారులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. గ్రామస్థులు కొడకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా... కుమారులను ఒక్క మాట అనకుండా మాతృమూర్తి మనసు చాటుకుంది లక్ష్మమ్మ.
ఇవీ చూడండి: అత్త పాడె మోసిన నలుగురు కోడళ్లు!