యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని బీసీ కాలనీతో పాటు పరిసర కాలనీల్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో 48 ద్విచక్రవాహనాలు, 3 ఆటోలు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. తెలంగాణలో సేఫ్ పోలీసింగ్, సేఫ్ కాలనీ నినాదంతో ముందుకు వెళ్తున్నమన్నారు.
వలిగొండలో నిర్బంధ తనిఖీలు
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేశారు. సోదాల్లో సరైన పత్రాలు లేని 48 ద్విచక్రవాహనాలు, 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.
పత్రాలు లేని వాహనాలు