ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీ కొనడం వల్ల ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం టేకులసోమారం వద్ద శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మృతుడు అనాజీపురం గ్రామానికి చెందిన బొల్లెపల్లి వేణు కొండల్గా గుర్తించారు. వలిగొండ నుంచి అనాజీపురానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బలకృష్ణా రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చెట్టును ఢీకొన్న బైక్.. యువకుడు మృతి - tree
శుక్రవారం అర్థరాత్రి యాదాద్రి జిల్లా టేకులసోమారం వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో అనాజీపురం గ్రామానికి చెందిన వేణు దుర్మరణం చెందాడు.
యువకుడు మృతి