యాదాద్రి అనుబంధ ఆలయం పాతగుట్టలో గర్భాలయానికి నూతన ముఖద్వారం బిగింపు పనులు చేపట్టారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం అర్చకులు ముఖద్వారానికి ప్రతిష్ట పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వైటీడీఏ వైస్‌ఛైర్మన్ కిషన్‌రావు, ఈవో గీతారెడ్డి, ఛైర్మన్ నరసింహమూర్తి పాల్గొన్నారు. గర్భాలయంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వర్ణమూర్తుల దర్శనం సంపూర్ణంగా కావడంలేదని, ఇందుకు ముఖద్వారాన్ని విస్తరించాలని యాదాద్రి దేవస్థానం నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఇందుకు ఈనెల 4న ద్వారం తొలగింపునకు పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో నూతన ముఖద్వారం బిగింపు పనులు చేపట్టారు. విస్తరణ పనుల దృష్ట్యా ఈనెల 6 నుంచి 10 వరకు మూలవర్యుల దర్శనం నిలిపివేశారు. ప్రత్యామ్నాయంగా ముఖ మండపంలో కవచమూర్తుల దర్శనాలను కొనసాగించనున్నట్లు ఈవో గీత తెలిపారు.