Yadadri reconstruction works: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి పుణ్యక్షేత్రం పనులు వేగవంతంగా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు యాదాద్రిని మహాదివ్యంగా తీర్చిదిద్దేందుకు యాడా అధికారులు శ్రమిస్తున్నారు. కొండపై హరిహరుల ఆలయాల పునర్నిర్మాణం పనులు పూర్తికావొచ్చాయి. మహా కుంభ సంప్రోక్షణకు ముహూర్తం ఖరారు కావడంతో కట్టడాలన్నింటినీ అప్పటిలోగా పూర్తి చేయాలని యాడా నిర్ణయించింది. ఈ క్రమంలో కొండ కింద చేపట్టిన ఆలయ పునఃనిర్మాణం పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, త్వరితగతిన పూర్తిచేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
దీక్షా మండపం
Yadadri temple reopen :భక్తి శ్రద్ధలతో దీక్ష చేపట్టే భక్తుల కోసం తగు వసతులతో దీక్షాపరుల మండపం 1.08 ఎకరాలలో నిర్మితమవుతోంది. రూ.8.90 కోట్లతో చేపట్టిన నిర్మాణం పనుల్లో పెయిటింగ్, ఆర్నమెంటల్ పనులు చేయాల్సి ఉంది. పురుషులు, మహిళలు వేర్వేరుగా ధ్యానం చేసుకునేందుకు హాళ్లు, ప్రత్యేక వంట గది, భోజనశాలతో పాటు మూత్రశాలలు, శౌచాలయాలు దివ్యాంగులకు వినియోగమయ్యేలా నిర్మించారు. ఈ నెలాఖరులోగా మండపం పూర్తి హంగులతో ఆవిష్కృతం కానుంది. రూ.21.48 కోట్లతో అంతర్గత రోడ్ల నిర్మాణం పనులు వేగవంతం చేశారు. కొండపై నుంచి గండి చెరువు వద్దకు చేరేందుకు ఫ్లై ఓవర్ వంతెన నిర్మితమవుతోంది. అక్కడికి చేరుకున్న భక్తులు మొక్కులు తీర్చుకునే ప్రాంగణాలకు వెళ్లే అంతర్గత దారుల నిర్మాణం 60 శాతం పనులు పూర్తయ్యాయి.
వ్రత మండపం