యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. అకాల వర్షం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయడంలో విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వం ధాన్యం కొనలేకపోతే.. ఎఫ్సీఐకి ఆ పని అప్పజెప్పాలని సూచించారు.
ధాన్యం కొనలేకపోతే.. ఎఫ్సీఐకి అప్పజెప్పాలి : వీహెచ్ - Telangaana Government Failed In Crops Buying Said By V Hanumanth Rao
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీహెచ్ విమర్శించారు. ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యం కొనలేకపోతే.. ఎఫ్సీఐకి అప్పజెప్పాలని ప్రభుత్వానికి సూచించారు.
ధాన్యం కొనలేకపోతే.. ఎఫ్సీఐకి అప్పజెప్ప్లాలి : వీహెచ్