సమస్యలపై ప్రశ్నించేందుకు తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఎమ్మెల్సీ ఎన్నికల స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజ్ఞప్తి చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలోని పలు పాఠశాలల ఉపాధ్యాయులను ఆయన కలుసుకున్నారు. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు.
ప్రశ్నించేందుకు ఒక్క అవకాశమివ్వవండి: తీన్మార్ మల్లన్న - తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
ప్రజల పక్షాన పోరాడే వారికి ఒక్క అవకాశమివ్వాలని నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని పాఠశాలలకు వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు.

ప్రశ్నించేందుకు ఒక్క అవకాశమివ్వవండి : తీన్మార్ మల్లన్న
ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఆస్తులను మాత్రమే పెంచుకున్నారని విమర్శించారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులను కలిసి తనకు ఓటు వేయాల్సిందిగా కోరారు. పట్టణంలోని బాలికల ఉన్నత పాఠాశాల, డీఈవో కార్యాలయం, కృష్ణవేణి టాలెంట్ స్కూల్, పంచాయతీ రాజ్ కార్యాలయం, గంజ్ హైస్కూల్లో విద్యావంతులను కలిసి మాట్లాడారు. పట్టభద్రుల ఓటర్ల సమస్యలను మల్లన్న అడిగి తెలుసుకున్నారు.