పేద ప్రజలు స్వేరో సర్కిల్లో విజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చని తెలంగాణ గురుకుల పాఠశాలల ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో స్వేరో సర్కిల్‌ను ప్రారంభించారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్వేరో సెంటర్‌కు పంపి, వారి అభివృద్ధికి సహకరించాలని కోరారు.
'కష్టపడి చదివితే ఇంటికో అంబేడ్కర్ అవతరిస్తాడు'
విజ్ఞానం ఎవరి సొత్తు కాదని, కష్టపడి చదివితే ఇంటికో అంబేడ్కర్ అవతరిస్తాడని తెలంగాణ గురుకుల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో స్వేరో సర్కిల్‌ను ఆయన ప్రారంభించారు.
యాదాద్రిలో స్వేరో సర్కిల్ ప్రారంభం
అనంతరం మోత్కూరులోని సంక్షేమ గురుకులాలను సందర్శించారు. వసతులు, విద్యార్థుల చదవు గురించి ఆరా తీశారు. గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.
- ఇదీ చూడండి : కండక్టర్ రవీందర్ అంతిమయాత్రలో ఉద్రిక్తత
TAGGED:
rs praveen kumar