తెలంగాణ

telangana

ETV Bharat / state

బొమ్మలరామారంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు - పోలీసుల తనిఖీలు

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారంలో పలు ప్రాంతాల్లో డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో 135 మంది పోలీసుల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

బొమ్మలరామారంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

By

Published : Nov 3, 2019, 1:14 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని తిమ్మాపూర్​లో డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో 135 మంది పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలులేని 17 ద్విచక్ర వాహనాలు, ఒక ట్రాక్టర్, రెండు కార్లను సీజ్​ చేశారు. అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపుల నుంచి 15వేల రూపాయలు విలువ చేసే మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. నలుగురు అనుమానితులను, ఒక రౌడీ షీటర్​ను అదుపులోకి తీసుకున్నామని డీసీపీ నారాయణరెడ్డి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రజలు భయబ్రాంతులకు గురికాకుండా ఉండేందుకు, చుట్టపక్కల ఎవరైనా అనుమానితులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

బొమ్మలరామారంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

ABOUT THE AUTHOR

...view details