తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఊపిరి ఆడకపోవడం వల్లే శ్రావణి చనిపోయింది'

భువనగిరి జిల్లా బొమ్మల రామారంలో శ్రావణి ఊపిరి ఆడకపోవడం వల్లే చనిపోయిందని జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్​ కోట్యానాయక్​ అన్నారు. పూర్తి వివరాలు ఫోరెన్సిక్​ నివేదికలో తెలుస్తాయని పేర్కొన్నారు. మరోవైపు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు.

శ్రావణి హత్యకేసు

By

Published : Apr 27, 2019, 7:16 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్​లో నిన్న అనుమానాస్పదంగా మృతి చెందిన శ్రావణి మృతదేహానికి పంచనామా నిర్వహించారు. ఊపిరి ఆడకపోవడం వల్లే శ్రావణి చనిపోయినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్​ కోట్యానాయక్​ తెలిపారు. శరీరం లోపల ఎడమ భాగాన పక్కటెముకలు విరిగినట్లు గుర్తించామన్నారు. పూర్తి వివరాలు ఫోరెన్సిక్​ నివేదిక అందిన అనంతరం తెలుస్తాయని అన్నారు.

ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నాం

శ్రావణి హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. కేసు దర్యాప్తులో అలసత్వం వహించారని ఆరోపణలు వస్తోన్న నేపథ్యంలో బొమ్మలరామారం ఎస్సై వెంకటేశ్వర్లును కమిషనరేట్​కు అటాచ్​ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని అతి త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు.

ఊపిరి ఆడకపోవడం వల్లే శ్రావణి చనిపోయింది

ఇదీ చదవండి : అదృశ్యమైన బాలిక మృతదేహం గుర్తింపు

ABOUT THE AUTHOR

...view details