యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం సంగ్య తండాకి చెందిన బాలాజీ నాయక్ దివ్యాంగుడు. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. చిన్నప్పుడే అతనికి పోలియో వచ్చి... దివ్యాంగుడిగా మారాడు. అంగవైకల్యంతో బాధపడకుండా స్వయం కృషితో.. మెకానిక్‌గా తన వృత్తిని కొనసాగించాడు. కుటుంబాన్ని పోషిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. గ్రామంలోని పలు రకాల కరెంట్ పనులు, మెకానిక్‌గా అనేక మరమ్మతులు చేస్తున్నాడు. అంతేకాకుండా ప్రభుత్వ అధికారులు అతన్ని చాలా సార్లు అభినందించారు.
'పట్టుదల ముందు... వైకల్యం చిన్నబోయింది' - Article on Balaji Nayak
అతను దివ్యాంగుడు.. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. పట్టుదలతో ఎలక్ట్రిక్ పనులు నేర్చుకున్నాడు. అదే పనితో ఇప్పుడు కుటుంబాన్ని పోషిస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నాడు. కాళ్లు సరిగ్గా పనిచేయకున్నా... చుట్టూ ఉండే వారికి ఎంతో ఆసరాగా మారిన బాలాజీ నాయక్‌పై కథనం.
'పట్టుదల ముందు... వైకల్యం చిన్నబోయింది'
ఇంటికి పెద్ద కొడుకు కావడంతో బాధ్యతలు తనమీద ఉన్నాయని బాలజీ నాయక్ చెబుతున్నాడు. ప్రభుత్వం ఏదైనా ప్రోత్సాహం కల్పించాలని కోరుతున్నాడు. గ్రామస్థులు కూడా ప్రభుత్వం బాలాజీని... ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి :మొబైల్ దుకాణంలో అగ్నిప్రమాదం... 18 లక్షల మేర ఆస్తినష్టం