తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో నారసింహునికి శత ఘటాభిషేకం - యాదాద్రిలో ప్రత్యేక పూజలు

యాదాద్రిలో నారసింహుని జన్మనక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శత కలశాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. అష్టోత్తర శత ఘటాభిషేకం పూజలు చేశారు. స్వాతి వేడుకలను పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

special-pujas-at-yadadri-in-honor-of-narasimha-temple
నారసింహుని జన్మనక్షత్రాన్ని పురస్కరించుకొని యాదాద్రిలో ప్రత్యేక పూజలు

By

Published : Oct 18, 2020, 12:35 PM IST

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో నేడు నారసింహుని జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామి వారికి శత ఘటాభిషేకం పూజలు నిర్వహించారు. స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి వేడుకలు ఆదివారం శాస్త్రోక్తంగా జరిగాయి. బాలాలయంలో కవచమూర్తులను కొలిచారు. స్వామి, అమ్మవార్లకు స్వర్ణ పుష్పాలతో అర్చన జరిపారు. శత కలశాలను ఏర్పాటు చేసి... ప్రత్యేక పూజలు చేశారు. పాలు, పెరుగుతో వేదమంత్రాల నడుమ నారసింహునికి అష్టోత్తర శత ఘటాభిషేకం జరిపారు.

స్వాతి నక్షత్రం సందర్భంగా స్థానికులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యాదాద్రి కొండ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అర్చకులు ప్రత్యేక పూజల అనంతరం క్షేత్ర మహత్యాన్ని భక్తులకు వివరించారు.

ఇదీ చదవండి:యాదాద్రిలో శరన్నవరాత్రోత్సవాలకు అంకురార్పణ

ABOUT THE AUTHOR

...view details