యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణమాసం ప్రారంభమైన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి సన్నిధిలో సుదర్శన, నారసింహ హోమాలు చేశారు. కరోనా వైరస్ విస్తరిస్తోన్న నేపథ్యంలో పెద్దఎత్తున భక్తులు ఆర్జిత సేవల్లో పాల్గొనడానికి వీలులేనందున లఘుదర్శనం మాత్రమే అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
యాదాద్రీశుడి ఆలయంలో శ్రావణమాస పూజలు - yadadri lakshmi narasimha swamy
శ్రావణమాసం ప్రారంభమైన సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని నారసింహ హోమం చేశారు.
యాదాద్రీశుడి ఆలయంలో శ్రావణమాస పూజలు
శ్రావణ మాసం పురస్కరించుకుని ఈనెల 22, 23, 24 తేదీల్లో ఆండాళ్ అమ్మవారికి తిరునక్షత్ర మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు చెప్పారు. 29 తేదీ నుంచి 31వరకు స్వామివారికి పవిత్రోత్సవాలు జరపనున్నట్లు వెల్లడించారు.
- ఇదీ చదవండి:లోపల అమ్మ మరణయాతన.. బయట బిడ్డ వేదన!