యాదాద్రి పుణ్యక్షేత్రం (Yadadri Temple) సందర్శనలో ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని కలిగించేందుకు ఆలయాలు, పరిసరాలు అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలో కొండ కింద గిరి ప్రదక్షిణ దారిని హరిత మయంగా మారుస్తున్నారు. ఓ పెద్ద బండపై వటపత్ర ఆకు నమూనా ఆకారం గిరి ప్రదక్షిణ దారిలో ఆకుట్టుకుంటోంది.
Yadadri Temple: యాదాద్రి కొండపై వటపత్ర ఆకు నమూనా - వటపత్ర ఆకు నమూనా
యాదాద్రి పుణ్యక్షేత్రం(Yadadri Temple) సర్వాంగ సుదరంగా రూపుదిద్దుకుంటోంది. అంతేకాదు ఆలయ పరిసరాలను సైతం ఆహ్లాదంగా మారుస్తున్నారు. ఈ క్రమంలో కొండ కింద ఉత్తర దిశలో ఉన్న బండపై వటపత్ర ఆకు నమూనా ఆకారం పూర్తికావచ్చింది. గిరి ప్రదక్షిణ దారిలో దాదాపు ముప్పావు ఎకరంలో మొక్కలతో ప్రత్యేక ఆకారం తయారు చేయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
నూతనంగా కొండ కింద ఉత్తర దిశలో ఉన్న ఆ బండపై వటపత్రం రూపం ఏర్పాటుకు పనులు చేపట్టారు. యాదాద్రీశుడికి భక్తులు గిరిప్రదక్షిణ చేసే దశలో రానున్న క్రమంలో… మానసిక ఆనందం, భక్తి తత్వం పొందేలా… ఆ దారిని నక్షత్రవనం, ఔషధ మొక్కలతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
సీఎం కేసీఆర్ సూచనలతో ఆ దారి క్షేత్ర స్థాయికి తగ్గట్లు ఉండాలని "యాడా"శ్రమిస్తోంది. వటపత్రం ఆకారంలో తీర్చిదిద్దే క్రమంలో దాదాపు ముప్పావు ఎకరంలో రాగి పత్రం ఆకారంలో పుణే నుంచి ప్రత్యేక మొక్కలు తెప్పించినట్లు అధికారులు చెబుతున్నారు.
ఇదీ చూడండి:Yadadri Temple: విశాల రహదారులు.. హరిత ప్రాంగణాలు