ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్​ నేత ఇంట్లో రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు - యాదగిరిగుట్ట మండలంలో ఐటీ సోదాలు

యాదగిరిగుట్టలోని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నేత బీర్ల ఐలయ్య ఇంట్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సమాచారం తెలుసుకున్న పలువురు నేతలు ఆయనను కలుసుకున్నారు. ఐలయ్యకు అన్యాయం జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు.

Second day ongoing IT probes at congress leader ilaiah
రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు
author img

By

Published : Mar 25, 2021, 9:06 AM IST

యాదగిరిగుట్ట మండలానికి చెందిన ప్రముఖ వ్యాపారి, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నేత ఐలయ్య నివాసంలో రెండో రోజు కూడా ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. యాదగిరిగుట్ట మండలం మైలార్ గూడెం పరిధిలోని ఓ స్థిరాస్తి వ్యాపార సంస్థతో ఉన్న అనుబంధం, స్థిరాస్తికి సంబంధించిన లావాదేవీలు, దస్తావేజులు, ఆస్తులు, పన్ను చెల్లింపు వివరాలను పరిశీలించి పలు కీలక పత్రాలు సేకరించినట్లు తెలుస్తోంది.

ఆయన ఇంట్లో ఐటీ సోదాల విషయం తెలుసుకున్న డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేశ్, జిల్లా నాయకులు కల్లూరు రామచంద్రారెడ్డి, సర్పంచ్​ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీర్ల శంకర్, యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, గుండ్లపల్లి భరత్, తదితరులు ఆయనను కలిశారు. ఐలయ్యకు అన్యాయం జరిగితే సహించబోమని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి :'హాస్టళ్ల మూసివేత నిర్ణయం వెనక్కి తీసుకోవాలి'

ABOUT THE AUTHOR

author-img

...view details