యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో పట్టపగలే చోరి జరిగింది. శాంతినగర్‌కు చెందిన దయ్యాల బాలరాజు ఇంటికి తాళం వేసి బయట పనులకు వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూస్తే... తాళం పగులగొట్టి ఉండటం గమనించాడు. లోపలికి వెళ్లి పరిశీలించగా.... బీరువాలో ఉన్న ఎనభై వేల నగదుతోపాటు ఇరవై వేల విలువ గల వెండిపట్టీలు చోరికి గురైనట్లు గమనించాడు. పక్కనే ఉన్న కొవ్వూరి గీత ఇంట్లోనూ ఇదేపరిస్థితి. తాళం పగులగొట్టి దాదాపు ఐదువేల రూపాయలు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనా స్థలికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు.
ఆలేరులోని 2 ఇళ్లలో పట్టపగలే చోరీ... - క్లూస్ టీం
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మిట్టమధ్యాహ్నమే చోరికి పాల్పడ్డారు దుండగులు. తాళాలేసి ఉన్న రెండు పక్కపక్క ఇళ్లల్లోనే దొంగతనానికి తెగబడ్డారు. బీరువా తాళాలు బద్దలుకొట్టి నగదు, ఆభరణాలు దొంగిలించారు.
ఆలేరులోని 2 ఇళ్లలో పట్టపగలే చోరీ...