తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో పోతిరెడ్డిపాడు వాసి మృతి - pothireddypadu

యాదాద్రి భువనగిరి జిల్లా రహీంఖాన్​పేట్​ వద్ద కల్వర్టు ప్రమాద సూచికను ఢీకొని పోతిరెడ్డిపాడుకు చెందిన నవీన్​ మృతిచెందాడు. కల్వర్టు నిర్మాణాల వద్ద రక్షణ కంచెలు లేకపోవడం వల్లనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

రోడ్డు ప్రమాదం.. పోతిరెడ్డిపాడు వాసి మృతి

By

Published : Jul 14, 2019, 10:48 AM IST

రోడ్డు ప్రమాదం.. పోతిరెడ్డిపాడు వాసి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం రహీంఖాన్​పేట వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. భువనగిరి-మోత్కూరు రహదారిలో నూతనంగా నిర్మిస్తున్న కల్వర్టు ప్రమాద సూచికను ద్విచక్రవాహనం ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. మృతుడు పోతిరెడ్డిపాడు గ్రామానికి చెందిన మక్తాల నవీన్​గా పోలీసులు గుర్తించారు.

భువనగిరిలో లారీ డ్రైవర్​గా పనిచేస్తున్న నవీన్​ విధులు ముగించుకొని అర్ధరాత్రి సమయంలో ఇంటికి తిరుగు పయనమయ్యాడు. కల్వర్టు వద్ద ఏర్పాటుచేసిన ప్రమాద హెచ్చరిక సూచికను ఢీ కొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. అర్ధరాత్రి ప్రమాదం జరిగినా ఉదయం వరకు ఎవరూ దాన్ని గమనించలేదు. ఉదయం 7 గంటల సమయంలో అటువైపు వెళ్తున్న ప్రయాణికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

కల్వర్టు నిర్మాణం చుట్టు ఎటువంటి రక్షణ కంచెలు ఏర్పాటుచేయకపోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.


ఇవీ చూడండి: పారిపోయాడు... దొరికిపోయాడు...

ABOUT THE AUTHOR

...view details