తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో సంపూర్ణ లాక్​డౌన్​ విధించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం!

యాదగిరిగుట్టలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పట్టణంలో 15 నుంచి 20 రోజులపాటు సంపూర్ణ లాక్​డౌన్ విధించాలని కోరుతూ... ఎమ్మెల్యే గొంగిడి సునీతకు వినతిపత్రం సమర్పించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఇతర ప్రాంతాల నుంచి భక్తుల రద్దీ రోజురోజుకు పెరగడం వల్ల కరోనా పాజిటివ్​ కేసులు పెరుగుతున్నాయని.. పుణ్యక్షేత్రం కరోనాకు కేంద్రంగా మారక ముందే సంపూర్ణ లాక్​డౌన్​ అమలు చేయాలని కోరారు.

Request Letter To Aler MLA For Asking Lock Down In Yadadri Town
యాదాద్రిలో సంపూర్ణ లాక్​డౌన్​ విధించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం!

By

Published : Sep 6, 2020, 6:59 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో సంపూర్ణ లాక్​డౌన్​ విధించాలని స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతకు స్థానిక తెరాస నేతలు వినతి పత్రం సమర్పించారు. నిత్యం పలు ప్రాంతాల నుంచి యాదాద్రికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్నదని, ఫలితంగా యాదాద్రి పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని.. పుణ్యక్షేత్రం కరోనా కేసులకు కేంద్రంగా మారకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, పట్టణంలో సంపూర్ణ లాక్​డౌన్​ అమలు చేసేలా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు.

ఇప్పటికే పట్టణంలో 100 మందికి పైగా పాజిటివ్​ చికిత్స పొందుతుండగా, తాజాగా మరో 8మంది కరోనా బారినపడి మృతి చెందారు. మార్చి నెలలో అమలు చేసినట్టు సంపూర్ణ లాక్​డౌన్​ అమలు చేసి యాదగిరిగుట్ట పట్టణాన్ని కరోనా రహిత ప్రాంతంగా మార్చాలని కోరారు. యాదాద్రి దేవస్థానంలో దర్శనాలు నిలిపివేయాలని, కొండపైన ఆలయంలోకి భక్తులను అనుమతించకుండా కేవలం పూజా కైంకర్యాలు మాత్రమే నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. యాదగిరిగుట్ట పట్టణ ప్రజలు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించేలా ప్రజలను అప్రమత్తం చేసే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేను కోరారు. పట్టణంలోకి వచ్చే దారులన్ని మూసేసి.. అత్యవసర పనుల నిమిత్తం వచ్చే వారిని మాత్రమే అనుమతించాలని కోరారు. ఈ మేరకు యాదగిరిగుట్ట తెరాస పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు గొంగిడి సునీతమహేందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రితో ఫోన్లో మాట్లాడారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస పట్టణ అధ్యక్షులు కాటబత్తిని ఆంజనేయులు, మున్సిపల్ ఛైర్మన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్, కౌన్సిలర్ బూడిద సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:కరోనా పంజా: దేశంలో ఒక్కరోజే 90,632 కేసులు

ABOUT THE AUTHOR

...view details