యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి నరసింహ స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మహా దివ్య క్షేత్రంగా పూర్తి స్థాయిలో తీర్చిదిద్దేందుకు ఆలయ ప్రాంగణంలో ఫ్లోరింగ్‌తో పాటు ప్రహారీ గోడలు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ మాడ వీధుల్లోనే కాకుండా దైవ దర్శనాల సముదాయంపైనా.. పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు శివాలయం పునర్నిర్మాణం పనులను కూడా మరింత వేగవంతం చేశారు.
ముమ్మరంగా యాదాద్రి పునర్నిర్మాణ పనులు - తెలంగణ వార్తలు
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి పునర్నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. నరసింహుడి సన్నిధికి నలు వైపులా నిర్మితమైన భగవంతుడి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. అందంగా తీర్చిదిద్దిన పలు శిలా రూపాలకు శిల్పులు తుది మెరుగులు దిద్దుతున్నారు.
ముమ్మరంగా యాదాద్రి పునర్నిర్మాణ పనులు
నిదర్శన మూర్తులు.. యాదాద్రి పంచ నరసింహులు క్షేత్రం కృష్ణ శిల్ప రూపాలతో ఆధ్యాత్మిక, ఆహ్లాదంగానే కాకుండా, అభయ ప్రదాత నిలయంగా ఆవిష్కృతం కానుంది. నరసింహుడి సన్నిధికి నలువైపులా నిర్మితమైన సాలహారాల్లో భగవంతుడి రూపాలు.. అష్టలక్ష్మీతో సహా భక్తాగ్రేసరులైన, గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి, హిందూతత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఆళ్వారుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం శిలా రూపాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు.