తెలంగాణ

telangana

ETV Bharat / state

శరవేగంగా సాగుతున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు

యాదాద్రి ఆలయ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆలయంలో సుందరమైన శిల్పాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వామివారి రథాన్ని నిలిపేందుకు రథశాల నిర్మాణానికి యాడా సన్నాహాలు చేపట్టింది.

By

Published : Dec 6, 2020, 8:29 AM IST

Reconstruction work of the Yadadri temple is in full swing
శరవేగంగా సాగుతున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయంలో పురాణ ఘట్టాలు ప్రతిబింబించేలా సుందరమైన శిల్పాలు తీర్చిదిద్దారు. అష్టభుజ మండప ప్రాకారంలోని స్థూపాలపై... మహా విష్ణువు రూపాలను చెక్కారు. క్షీరసాగర మథనం, ఆదిశేషుడిపై విష్ణువు వంటి కళా రూపాలు భక్తులను ఆకట్టుకుంటాయి. విష్ణు పుష్కరిణికి సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం చుట్టూ ప్రహారీ గోడను సైతం నిర్మిస్తున్నారు.

రథశాల నిర్మాణం

క్షేత్రంలో స్వామి వారి రథశాల నిర్మాణానికి యాడా సన్నాహాలు చేపట్టింది. ప్రధాన ఆలయానికి వాయవ్య దిశలో 30 అడుగుల ఎత్తులో రథశాల ఏర్పాటు కానుంది. ప్రత్యేక నిపుణులతో ఆ పనులు నిర్వహిస్తున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. రథశాల ఏర్పాటుకు అనుకూలంగా వెల్డింగ్ పనులను ప్రారంభించారు.

శరవేగంగా సాగుతున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు
ఇదీ చూడండి: పోలేపల్లిలో అంతర్జాతీయ పశుపోషకాల ఉత్పత్తి పరిశ్రమ

ABOUT THE AUTHOR

...view details