పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో రథసప్తమి వేడుకలను ఘనంగా జరిపారు. వివిధ రకాల పూలతో స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ అర్చకులు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని భక్తి శ్రద్ధలతో భక్తులు దర్శించుకున్నారు.
'యాదాద్రిలో ఘనంగా రథసప్తమి వేడుకలు...పాల్గొన్న సీఐడీ అధికారి' - DGP Vinod Singh visited Yadadri
సూర్యభగవానుడి జన్మదినం సందర్భంగా పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీఐడీ విభాగానికి చెందిన డీజీపీ వినోద్ సింగ్ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ పూజారులు వారికి ప్రత్యేక ఆశీర్వచనం చేసి.. స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేశారు.
'యాదాద్రిలో ఘనంగా రథసప్తమి వేడుకలు...పాల్గొన్న సీఐడీ అధికారి'
తెలంగాణ సీఐడీ విభాగానికి చెందిన డీజీపీ వినోద్ సింగ్ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు వారికి ప్రత్యేక ఆశీర్వచనం చేసి.. స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేశారు.
ఇదీ చదవండి:ట్రాన్స్ జెండర్స్ సంక్షేమంపై ఆలోచిస్తాం: కేటీఆర్