యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో గణపయ్య నవరాత్రి ఉత్సవాలను(Ganesh navaratri celebrations) వినూత్నంగా నిర్వహిస్తున్నారు. భక్తులు కానుకలు సమర్పించేందుకు సరికొత్తగా క్యూ ఆర్ కోడ్‌ను ఏర్పాటుచేశారు. స్కానింగ్ ప్రింట్‌ను వినాయకుని ప్రతిమ చేతిపై ఉంచి భక్తుల నుంచి కానుకలు స్వీకరిస్తున్నారు. డిజిటల్ చెల్లింపుల కోసమే వినూత్నంగా ఈ పద్ధతిని ఏర్పాటుచేసినట్లు మండప నిర్వాహకులు తెలిపారు.
ఈ కరోనా(corona) సమయంలో ఎక్కువగా కరెన్సీ నోట్లను వాడడం లేదు. అందుకోసం కొత్త ఆలోచనలతో మా మండపం వద్ద ఆన్‌లైన్ (online transactions)ద్వారా కానుకలు సమర్పించే వీలు కల్పించాం. భక్తుల సౌకర్యం కోసమే క్యూఆర్ కోడ్‌ని(qr code) ఏర్పాటు చేశాం. ఈ నిర్ణయంతో నిర్వహణ ఖర్చుల లెక్కలు కూడా పారదర్శకంగా ఉంటాయి.