తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రియుడి ఇంటి ముందు ధర్నా - LOVERS HOUSE

యాదాద్రి జిల్లా మోత్కూరులో ప్రేమించి మోసం చేశాడని ఆరోపిస్తూ ప్రియుడి ఇంటి ముందు ఓ యువతి కుటుంబ సభ్యులతో దీక్ష చేపట్టింది. ఇద్దరు భర్తలను కాదని వస్తే వివాహం చేసుకోకుండా ముఖం చాటేస్తున్నట్లు తెలిపింది.  పోలీసుల సూచనతో మోసగించిన వ్యక్తిపై ఫిర్యాదుకు ఉపక్రమించింది.

పెళ్లి చేసుకోవాల్సిందే...!

By

Published : Feb 28, 2019, 1:09 AM IST

పెళ్లి చేసుకోవాల్సిందే...!
ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించాడని ఓ యువతి కుటుంబ సభ్యులతో ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.ఐదేళ్లుగా ప్రేమించానని మోసం పొడిచేడు గ్రామానికి చెందిన మహేశ్వరి అదే గ్రామానికి చెందిన నర్రె వేణుమాధవ్​ ప్రేమించి మోసం చేశాడని ఆరోపించింది. 2015లో వివాహమైన తనకు భర్తతో విడాకులు తీసుకుంటే ఇద్దరం కలిసి ఉండొచ్చని నమ్మబలికి తర్వాత వదిలేశాడని తెలిపింది. 2017లో రెండో వివాహం చేసుకొని భర్తతో హైదరాబాద్​లో ఉంటున్న తనను నిత్యం వేధించేవాడని.. అది తెలిసి రెండో భర్త కూడా వదిలేసి వెళ్లిపోయాడని పేర్కొంది. వేణుమాధవ్​ నమ్మించి తన జీవితాన్ని నాశనం చేశాడని.. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేస్తున్నట్లు తెలిపింది.

ఇంటి ముందు దీక్ష
తల్లిదండ్రులు కుల పెద్దలతో పంచాయతీ పెట్టగా.. రెండు రోజులు గడువు కోరి కనిపించడం లేదని బాధితురాలు పేర్కొంది. న్యాయం కోసం వేణుమాధవ్​ ఇంటి ముందు కుటుంబ సభ్యులతో దీక్ష చేపట్టింది. పోలీసుల సూచనతో ఫిర్యాదు చేసింది.

ABOUT THE AUTHOR

...view details