యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, రాజాపేట, తుర్కపల్లి మండలాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు అలుగులు పారుతున్నాయి. యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం గ్రామంలోని చెరువు నిండి అలుగు పోస్తోంది. మల్లాపురం చెరువు నుంచి వాగుల ద్వారా సైదాపురం, మైలారిగూడెం, రామాజీపేట్ చెరువుల్లోకి నీరు చేరడం వల్ల ఆ చెరువులు కూడా అలుగులు పారుతున్నాయి.
వరుసగా కురుస్తున్న వర్షాలకు రాజాపేట మండలంలోని బేగంపేట ,పొట్టిమర్రి, పారుపల్లి గ్రామశివారులోని వాగులు ఉప్పొంగాయి. కల్వర్టుల మీదుగా నీరు ప్రవహిస్తుండడం వల్ల వాహనదారులు అవస్థలు పడుతూ ప్రయాణం సాగించారు. నెమిల గ్రామానికి చెందిన చెరువు నిండడం వల్ల గ్రామస్థులు పూజలు చేశారు.
ఉప్పొంగుతున్న వాగులు, వంకలు - yadadri bhuvanagiri district news
ఇటీవల కురిసిన వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, రాజాపేట, తుర్కపల్లి మండలాల్లోని చెరువులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. గ్రామాల్లోని చెరువులు నిండడం వల్ల రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
ఉప్పొంగుతున్న వాగులు, వంకలు
తుర్కపల్లి మండలంలోని పలు గ్రామాల్లోని చెరువులు, కుంటలు నిండి అలుగు పోస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు మండల కేంద్రంలోని బహదూర్ మియా, వెంకటాపూర్‌లోని చౌదరి, తోక చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. మండలంలోని అన్ని గ్రామాల్లోని చెరువులు నిండడం వల్ల చెరువుల కింద ఉన్న ఆయకట్టు సాగులోకి రావడంతో పాటు భూగర్భ జలాలు పెరిగి పంటలు సమృద్ధిగా పండుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: మానేరు వద్ద మనోహర దృశ్యం.. పర్యటకుల కోలాహలం