తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్​ - aleru

యాదాద్రి  జిల్లా ఆలేరు నియోజక వర్గంలోని ఆరు మండలాల్లో రెండో విడత ప్రాదేశిక పోలింగ్​ ప్రశాంతంగా జరుగుతోంది. అక్కడక్కడా స్పల్ప ఘటనలు జరిగినా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

polling-in-yadadri

By

Published : May 10, 2019, 3:50 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలింగ్​ సజావుగా సాగుతోంది. ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు, రాజపేట, తుర్కపల్లి, గుండాల, యాదగిరిగుట్ట, మోటకొండూరు మండలాల్లో పోలింగ్​ జరుగుతోంది. మొత్తం 285 పోలింగ్​ కేంద్రాల్లో 1,40,144 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నియోజకవర్గంలోని అక్కడక్కడా కార్యకర్తల మధ్య స్వల్ప వాగ్వాదం జరగ్గా పోలీసులు శాంతింపజేశారు. నియోజకవర్గంలోని సమస్యాత్మక పోలింగ్​ కేంద్రాలను సీఐడీ అడిషనల్​​ డీజీ గోవింద్​సింగ్​ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

యాదాద్రి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details