యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలో శ్రావణి హత్య కేసుకు సంబంధించి ఓ యువకుణ్ని ఇవాళ ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, ప్రజాసంఘాలు భువనగిరి జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. తమకు స్పష్టమైన హామీ వచ్చే వరకూ అంత్యక్రియలు నిర్వహించబోమని బొమ్మల రామారంలో మృతదేహంతో నిరసన తెలిపారు.
ఫోరెన్సిక్ నివేదికతో స్పష్టత
శ్రావణి హత్య కేసులో ఫోరెన్సిక్ నివేదిక కీలకం కానుంది. ఊపిరి ఆడకపోవడం వల్లే చనిపోయినట్లు శవ పంచనామాలో నిర్ధరణకు వచ్చారు. శరీరం లోపల ఎడమ భాగంలో 4 పక్కటెముకలు విరిగాయని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ కోట్యా నాయక్ తెలిపారు.
నిందితులను పట్టుకుంటాం
నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు వస్తున్న బొమ్మల రామారం ఎస్సై వెంకటేశ్‌ను సీపీ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు పేర్కొన్నారు.