తెలంగాణ

telangana

ETV Bharat / state

తుర్కపల్లిలో కోతుల దాడులు.. ఆస్పత్రుల్లో ప్రజలు.. - తుర్కపల్లిలో కోతుల విధ్వంసం

అడవుల్లో ఉండాల్సిన కోతులు జనావాసాల్లో స్వైర విహారం చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఇళ్లలోకి దూరి గృహోపరకరణాలను నాశనం చేస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో వాటిని అడ్డుకోబోతే దాడికి దిగి విజృంభిస్తున్నాయి. ఆస్పత్రి బారిన పడిన బాధితులు శరీరం మొత్తం గాయాలై నానా ఇబ్బందులు పడుతున్నారు.

people fear for monkey attack in turkapalli yadadri district
తుర్కపల్లిలో కోతుల దాడులు.. ఆస్పత్రుల్లో ప్రజలు..

By

Published : Dec 13, 2019, 6:58 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో కోతుల బెడద రోజురోజుకీ పెరిగిపోతోంది. అడవుల్లో ఆహారం దొరకక పల్లె సీమల్ని ఆక్రమించుకుంటున్నాయి. గ్రామాల్లో ఉన్న ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. తాజాగా వాసాలమర్రి గ్రామంలో ప్రజలపైన విజృంభించి కరుస్తున్నాయి.

ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్న బాధితులు...

బాధితులు ఆస్పత్రి బారిన పడుతున్నారు. శరీరం మొత్తం గాయాలై నానా ఇబ్బందులు పడుతున్నారు. కర్ర లేనిదే ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి కనబడుతోంది. మనిషి కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ విషయంలో సవాల్ విసురుతున్నాయి. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులను భయపెడుతున్నాయి.

ఇంటి బయట కూర్చున్నా వదలట్లేదు..

ఇదే గ్రామానికి చెందిన ఓ 90 ఏళ్ల వృద్ధురాలు స్నానం చేస్తుండగా కోతులు తమపైకి దూకి కరిచాయని వాపోయింది. ఆలయానికి తల్లి... మూడు నెలల బాబుతో వెళ్లగా చిన్నారిని కరిచేందుకు వానరాలు యత్నించాయని... కాపాడబోతే తనను కరిచాయని వాపోయింది. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదంటూ ఆవదేన వ్యక్తం చేస్తున్నారు.

రోజులో ఎక్కువ శాతం కేసులు అవే...

తుర్కపల్లి ప్రభుత్వ ఉన్నత వైద్యాధికారిని సంప్రదిస్తే.. రోజులో కోతులు కరిచిన వారే ఎక్కువమంది చికిత్స కోసం వస్తున్నట్లు తెలిపారు. వానరాలు దాడి చేస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యం చేయించుకోవాలని సూచించారు.

కోతులను పట్టుకొని వెంటనే అడవుల్లో విడిచిపెట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

తుర్కపల్లిలో కోతుల దాడులు.. ఆస్పత్రుల్లో ప్రజలు..

ఇవీ చూడండి : 'కేసీఆర్​ది బార్​ బచావో.. బార్​ బడావో నినాదం'

ABOUT THE AUTHOR

...view details