తెలంగాణ

telangana

ETV Bharat / state

'నయీం అనుచరులపై పీడీ చట్టం నమోదు' - NAYEEM WIFE SHAHEEN BEGUM

యాదాద్రి భువనగిరి జిల్లాలో నయీం బినామీ ఆస్తులను అతని అనుచరులు విక్రయిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నయీం భార్య షాహీన్ బేగంతో సహా ఇద్దరు అనుచరులను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

పీడీ చట్టం కింద కేసు నమోదు చేస్తే ఏడాది పాటు జైలు శిక్ష

By

Published : Jun 24, 2019, 11:08 PM IST

నయీం అనుచరులపై రాచకొండ పోలీసులు పీడీ చట్టం కింద కేసు నమోదు చేశారు. నయీం భార్య షాహీన్ బేగం, అనుచరులు పాశం శ్రీను, నాజర్, ఫహీమ్​లపై పీడీ యాక్ట్ నమోదు చేస్తూ కమిషనర్ మహేశ్ భగవత్ నిర్ణయం తీసుకున్నారు. నయీం బతికున్న సమయంలో పలువురిని బెదిరించి బినామీ పేర్ల మీద భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎన్​కౌంటర్​లో మృతి అనంతరం పుప్పాలగూడలోని నయీమ్ ఇంట్లో సోదాలు నిర్వహించిన సిట్ అధికారులు అక్రమాస్తులను గుర్తించారు.
ఆయా భూముల క్రయవిక్రయాలను నిలిపేయాలంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాసింది. అయినప్పటికీ నయీం అనుచరులు బినామీ ఆస్తులను విక్రయించారు. భువనగిరి పట్టణంలో నయీం బినామీ ఆస్తులను అతని అనుచరులు విక్రయిస్తుండగా ముందస్తు సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. పీడీ చట్టం కింద కేసు నమోదు చేయడం వల్ల ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

నయీం భార్య ,అనుచరులపై పీడీ యాక్ట్ నమోదు చేసిన కమిషనర్ మహేశ్ భగవత్

ABOUT THE AUTHOR

...view details