తెలంగాణ

telangana

ETV Bharat / state

yadadri: యాదాద్రిలో ముగిసిన పవిత్రోత్సవాలు - లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో జరుగుతున్న పవిత్రోత్సవాలు నేటితో ముగిశాయి. ఈనెల 17న ప్రారంభమైన పవిత్రోత్సవాలు మూడు రోజుల పాటు వైభవోపేతంగా జరిగాయి.

యాదాద్రి
యాదాద్రి

By

Published : Aug 19, 2021, 3:35 PM IST

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మూడు రోజులుగా జరుగుతున్న పవిత్రోత్సవాలు నేటితో ముగిశాయి. చివరి రోజైన ఇవాళ పవిత్రమాల ధారణ, మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలను శాస్త్రోత్తంగా ముగించారు. ఆలయ పవిత్రతను ద్విగుణీకృతం చేస్తూ తెలిసీ తెలియక ఏడాది నుంచి చేసిన తప్పొప్పులు తొలగిపోవాలని... ఆలయంలో ఏటా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

యాదాద్రి

మేళతాళాలు, పండితుల వేదపారాయణాల నడుమ మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలకు పరిసమాప్తి పలికారు. ఉత్సవాల సందర్భంగా రెండు రోజులుగా నిలిపివేసిన నిత్య కల్యాణం, సుదర్శన హోమం శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి.

యాదాద్రిలో ముగిసిన పవిత్రోత్సవాలు

యాదాద్రీశుడి సన్నిధిలో పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఏడాదిలో తెలిసో తెలియకో చేసిన తప్పులను మన్నించమని ప్రార్థిస్తూ చేసే ఉత్సవమే పవిత్రోత్సవం. ఉత్సవాల్లో మూడోరోజైన ఇవాళ స్వామివారికి పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. రేపటి నుంచి స్వామివారి నిత్యకల్యాణం, సుదర్శన హోమం కార్యక్రమం జరుగుతుంది. - ఆలయ అర్చకులు

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికే తలమానికంగా రూపుదిద్దుతున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు సాగుతున్నాయి. ప్రత్యేక కళాఖండాలు, ఆకృతులు, శిల్పాలు స్వామివారి ఆలయంలో కొలువుదీరుతున్నాయి. ఆలయం విద్యుద్దీపకాంతుల్లో దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్మేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధ ఆలయంగా యాదాద్రిని ముస్తాబు చేస్తున్నారు.

యాదాద్రిలో ముగిసిన పవిత్రోత్సవాలు

ఇదీ చూడండి:YADADRI: దేదీప్యమానంగా యాదాద్రి పుణ్యక్షేత్రం.. సకల హంగుల సమాహారం

ABOUT THE AUTHOR

...view details