శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ నిర్మాణంలో ఎంతో నిష్ఠతో పాలుపంచుకోవడం ప్రశంసనీయమని యాదాద్రి ఆలయ ఆర్కిటెక్ట్ ఆనంద్సాయిని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఆలయ నిర్మాణం, సంబంధిత వాస్తు అంశాలపై ఎంతో పరిశోధన చేసిన ఆయనకు ధార్మిక రత్న పురస్కారం దక్కడం సముచితమని పేర్కొన్నారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఆనంద సాయిని శాలువాతో సత్కరించారు.
యాదాద్రి ఆలయ ఆర్కిటెక్ట్ని అభినందించిన పవన్ కల్యాణ్ - janasena precident pavan kalyan latest
ధార్మిక రత్మ పురస్కారం వరించిన సందర్భంగా యాదాద్రి ఆలయ ఆర్కిటెక్ట్ ఆనంద్సాయిని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభినందించారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో శాలువాతో సత్కరించారు.
యాదాద్రి ఆలయ ఆర్కిటెక్ట్ని అభినందించిన పవన్ కల్యాణ్
ఇటీవల హైదరాబాద్ బిర్లా ఆడిటోరియంలో శ్రీ శాంతికృష్ణ సేవా సమితి నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి చేతుల మీదుగా యాదాద్రి ఆలయ ముఖ్య ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి ‘ధార్మిక రత్న’ పురస్కారం స్వీకరించారు.
ఇదీ చూడండి: కాల్ సెంటర్ స్కామ్లో రూ.190 కోట్లు సీజ్: సీబీఐ