తెలంగాణ

telangana

ETV Bharat / state

'సర్పంచులు బాధ్యతాయుతంగా పనిచేశారు' - రెండో విడత పల్లె ప్రగతి

రాష్ట్ర వ్యాప్తంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని తుంగతుర్తి శాసనసభ సభ్యులు గాదరి కిషోర్ ​కుమార్​ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా దత్తప్పగూడెం గ్రామంలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

palle-pragathi-program-in-yadadri
'సర్పంచులు బాధ్యతాయుతంగా పనిచేశారు'

By

Published : Dec 29, 2019, 11:19 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామంలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై గ్రామ సర్పంచులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల సర్పంచులు బాధ్యతాయుతంగా పనిచేసి గ్రామాలను అభివృద్ధి పరచారని, ఇంకా గ్రామాల్లో పూర్తికాని సమస్యలు ఏమైనా ఉంటే రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పూర్తిచేయాలని కిషోర్​ కోరారు.

గ్రామాల్లో తాగు, సాగు నీటి సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచనలు ఇచ్చారు.

'సర్పంచులు బాధ్యతాయుతంగా పనిచేశారు'

ఇవీ చూడండి: 'చట్టసభల కమిటీలు క్రియాశీలకంగా పని చేయాలి'

ABOUT THE AUTHOR

...view details