తెలంగాణ

telangana

ETV Bharat / state

నిఖిలేశ్వర్‌కు పురస్కారం.. గ్రామస్థుల సంతోషం - kendra sahitya academy award

ప్రముఖ దిగంబర కవి నిఖిలేశ్వర్‌ను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రాసిన అగ్నిశ్వాస కవితా సంపుటికి ఈ అరుదైన పురస్కారం లభించింది.

Nikhileshwar Award Villagers Happiness at verapalli yadadri
నిఖిలేశ్వర్‌కు పురస్కారం..గ్రామస్థుల సంతోషం

By

Published : Mar 12, 2021, 9:48 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా వీరవెల్లి గ్రామానికి చెందిన దిగంబర, విప్లవ కవిగా సాహితీ ప్రపంచంలో విరాజిల్లిన.. నిఖిలేశ్వర్‌(82)కు కేంద్ర ప్రభుత్వం సాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం మొత్తం 20 మందికి సాహిత్య అకాడమీ పురస్కారాలు ప్రకటించగా.. తెలుగులో నిఖిలేశ్వర్‌ రాసిన కవితా సంపుటి అగ్ని శ్వాసకు అవార్డు లభించింది. ఆయన కలం పేరు నిఖిలేశ్వర్​కాగా.. అతని అసలు పేరు కుంభం యాదవరెడ్డి. దిగంబర కవుల్లో నిఖిలేశ్వర్‌ ఒకరు.

దిగంబర కవిత్వం 1960-70 వరకు మూడు సంపుటలుగా వెలువడింది. ఇతని రచనలు మండుతున్న తరం, ఈనాటికి కావ్యాలు ప్రసిద్ధి చెందాయి. కవి, అనువాదకుడు, విమర్శకుడిగా ప్రజాదృక్పథం గల అనేక రచనలు చేశారు. నిఖిలేశ్వర్‌ వీరవెల్లి గ్రామం నుంచి చాలా ఏళ్ల కిందటే ఊరు విడిచి వెళ్లి హైదరాబాద్​లో స్థిరపడ్డారు. కాగా తమ గ్రామ వాసికి కేంద్ర సాహిత్య అవార్డు రావటం పట్ల స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి :వీరప్ప మొయిలీకి సాహిత్య అకాడమీ పురస్కారం

ABOUT THE AUTHOR

...view details