తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు సాయం - NihaRika Reddy Assistance to families in yadadri

హైదరాబాద్​ శ్రీనగర్ కాలనీకి చెందిన నిహారిక రెడ్డి ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. నెలకు సరిపడు బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పిల్లలకు చెప్పులు అందజేశారు.

Assistance to families who have lost their jobs
Assistance to families who have lost their jobs

By

Published : May 20, 2021, 8:34 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్​ మున్సిపాలిటీ కేంద్రంలో అంగడి బజార్​లో ఉన్న ఏడు బుడగ జంగాల కుటుంబాలు కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయాయి. వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని గ్రహించిన ప్రముఖ ఫ్యాషన్​ డిజైనర్ నిహారిక రెడ్డి ముందుకొచ్చారు.

హైదరాబాద్​ శ్రీనగర్ కాలనీకి చెందిన నిహారిక రెడ్డి ఆర్థిక సాయంతో నెలకు సరిపడ బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పిల్లలకు చెప్పులు అందజేశారు. లబ్ధి పొందిన ఏడు కుటుంబాలు ఈ విపత్తు సమయంలో ఆదుకున్న నిహారికరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చూడండి:పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ కొత్త పోర్టల్

ABOUT THE AUTHOR

...view details