పెళ్లి సందడిలో మృత్యుఘోష
ప్రమాదంలో నూతన దంపతుల మృతి - నూతన దంపతులు
పెళ్లై నెల రోజులు కూడా కాలేదు. వివాహ బంధంతో జీవితాంతం కలిసి ఉంటామని ప్రతిజ్ఞ చేసుకున్న ఆ దంపతులు రోడ్డు ప్రమాదంతో చావులో ఒక్కటయ్యారు. ఇంట్లో పెళ్లి సందడి ఇంకా తీరక ముందే వారు మృత్యు ఒడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న బంధువులు గుండెలవిసేలా రోదించారు. ఈ విషాద ఘటన యాదాద్రి జిల్లాలో చోటు చేసుకుంది.
రోడ్డు ప్రమాదం
మృతులు గుండాల మండలం బ్రహ్మణపల్లికి చెందిన నరేష్, కేసారం గ్రామానికి చెందిన దివ్యగా గుర్తించారు. వీరికి గత నెల 20న వివాహమయ్యింది. నూతన దంపతులు చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి :కశ్మీర్లో కాల్పులు...ముగ్గురు తీవ్రవాదులు హతం