రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణలో భాగంగా కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేసే పనిలో పడింది. ఈ క్రమంలో ఆటంకంగా ఉన్న ప్రతీ సమస్యను పరిష్కరించాలని అధికారులు కృషి చేస్తున్నారు. యాదాద్రి జిల్లాలోని మోత్కూరులో అధికారులకు వీధుల్లో తిరిగే మేకలు, పందులే ప్రధాన సమస్యగా మారాయి.
జరిమానాలే ప్రధానాస్త్రం...
కార్యాలయానికి వస్తున్న ఫిర్యాదుల గోల తట్టుకోలేక... ఎలాగైన ఈ సమస్యను పరిష్కరించాలన్న ఉద్దేశంతో... మున్సిపాలిటీ అధికారులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్లపై తిరుగుతున్న మేకలు, పందులపై అధికారులు ఫోకస్ పెట్టారు. మేకకు రూ. 500, పందికి రూ.వెయ్యి చొప్పున జరిమానాలు విధించారు. ఇలా ఇప్పటివరకు పన్నెండు మేకల యజమానుల నుంచి జరిమానాలు వసూలు చేశారు.