ఉత్తరప్రదేశ్లోని హాథ్రస్లో ఓ దళిత యువతిపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కలెక్టరేట్ ముందు ఎమ్ఆర్పీఎస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
సమాజంలో మహిళలు రాత్రిపూట కాదు.. ఉదయం కూడా ఒంటరిగా తిరిగే అవకాశం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎన్ని చట్టాలు తెచ్చినా ఆకతాయిలకు వివిధ రాజకీయ పార్టీలు కొమ్ముకాస్తున్నంతకాలం దళిత మహిళలపై దాడులు జరుగుతూనే ఉంటాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి చట్టాలను కఠినంగా అమలు చేయాలన్నారు. చట్టాలను కఠినంగా అమలు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్కి వినతి పత్రాన్ని అందించారు.