MP Santosh: యాదాద్రి ఆలయ సోయగాలు పంచిన ఎంపీ - యాదాద్రి వార్తలు
ప్రపంచ నలుమూలల నుంచి భక్తులను యాదాద్రి ఆకర్షిస్తోందని ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు. యాదాద్రిని పౌరాణిక కేంద్రంగా మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని వెల్లడించారు. సోమవారం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించిన ఆయన కొన్ని చిత్రాలు ట్వీటర్ వేదికగా పంచుకున్నారు.
రాత్రి వేళలో విద్యుత్ కాంతిలో
సుందరమైన ఆర్కిటెక్చర్‌తో తీర్చిదిద్దిన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ఎంపీ సంతోష్ కుమార్ సందర్శించారు. అక్కడి సుందర కట్టడాలను, దృశ్యాలను తన కెమెరాతో క్లిక్‌మనిపించారు.