కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని వెల్లడించారు. ఎల్‌ఆర్‌ఎస్ విషయంలో కూడా ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి లేఖ రాశారు.
'కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేయాలి' - సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ
సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ రాశారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శాసనసభ తీర్మానం చేయాలని కోరారు. తీర్మానానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. సామాన్యులకు పెనుభారంగా మారిన ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని సూచించారు.
mp komatireddy venkatreddy cm kcr
ప్రజలు ఎల్ఆర్ఎస్పై ఆందోళన చెందుతున్నారని తెలిపారు. సామాన్యుడికి పెనుభారంగా మారిని ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రభుత్వం రద్దు చేయాలని... ఒక వేళ సాధ్యం కాకపోతే ఎటువంటి ఫీజులు లేకుండా అమలు చేయాలన్నారు. దీనిపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు.
ఇదీ చదవండి :గ్రామ కార్యదర్శికి ఆస్తుల వివరాలు తెలిపిన సీఎం కేసీఆర్