ప్రధానికి మోదీ, సీఎం కేసీఆర్ చెప్పిన ప్రకారం స్వీయ నియంత్రణతోనే కరోనాను అంతం చేయవచ్చునని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని పారిశుద్ధ్య కార్మికులు, ఆశ కార్యకర్తలు, పోలీసులు, పాత్రికేయులకు సొంత నిధులతో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.
'స్వీయ నియంత్రణతోనే కరోనా కట్టడి' - LOCK DOWN UPDATES
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని పారిశుద్ధ్య కార్మికులు, ఆశ కార్యకర్తలు, పోలీసులు, పాత్రికేయులకు ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. స్వీయ నియంత్రణతోనే కరోనాను కట్టడి చేయగలమని తెలిపారు.
'స్వీయ నియంత్రణతోనే కరోనా కట్టడి'
అనంతరం టోల్గేట్ వద్ద ట్రాఫిక్ పోలీసులకు మాస్కులు, శానిటైజర్లు అందించారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి అవిశ్రాంతంగా శ్రమించడం వల్లే యాదాద్రి భువనగిరి జిల్లాకు గ్రీన్‌జోన్‌గా గుర్తింపు లభించిందని... లాక్డౌన్ ముగిసే వరకు ప్రజలంతా సహకరించాలని కోరారు.