యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థాన ప్రధానాలయ పునర్నిర్మాణంలో భాగంగా కొండ కింద చేపట్టిన రోడ్డు విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోతున్న బాధితులకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సునీత భరోసా ఇచ్చారు. యాదగిరిగుట్ట మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఛాంబర్‌లో బాధితులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు.
'రోడ్డు విస్తరణలో బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది'
యాదాద్రిలో రోడ్డు విస్తరణ చర్యల్లో భాగంగా ఇళ్లు, దుకాణాలు కోల్పోతున్న బాధితులకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఎమ్మెల్యే గొంగిడి సునీత భరోసా ఇచ్చారు. బాధితులకు తగు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు.
'రోడ్డు విస్తరణలో బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది'
ఇటీవల యాదాద్రి పర్యటనలో సీఎం కేసీఆర్ బాధితులకి ఇచ్చిన హామీ విధంగా తగున్యాయం జరిగేలా కృషి చేస్తామని వివరించారు. పరిహారం పెంపువిషయంలో మరోమారు అధికారులతో మాట్లాడి స్పష్టత ఇప్పించాలని బాధితులు ఎమ్మెల్యేను కోరారు. ఈ భేటీలో పుర ఛైర్‌పర్సన్ సుధా, కౌన్సిలర్లు నాగరాజు, బాధితులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:కరోనా కాటు: జీవన చక్రం ఆగింది.. బతుకు చిత్రం మారింది!