తెలంగాణ

telangana

ETV Bharat / state

'తుర్కపల్లి మండలంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం' - Yadadri District Latest News

యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండలంలో ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్​రెడ్డి పర్యటించారు. మండలంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీనిచ్చారు.

MLA Gongidi Sunita Mahender Reddy talk about  Turkapalli mandal development
'తుర్కపల్లి మండలంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం'

By

Published : Nov 9, 2020, 10:44 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్​రెడ్డి పేర్కొన్నారు. వాసాలమర్రి గ్రామంతో పాటు గిరిజన తండాలు, అన్ని గ్రామాల్లో కావాల్సిన సదుపాయాలతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. తుర్కపల్లి మండలాన్ని ఆదర్శంగా తయారు చేయాడానికి ప్రజాప్రతినిధులు పాటు పడాలని సూచించారు.

తాగు, సాగునీరుతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో 280 హెచ్​ఆర్​ఎస్​ ట్యాంకులు మంజూరయ్యాయని.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ హెల్త్​ కార్డులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. తుర్కపల్లిలో చేపట్టబోయే ఇండస్ట్రీయల్​ పార్క్​ నిర్మాణంతో యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు.

ఇదీ చూడండి:సైబర్‌ సెక్యూరిటీ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్‌

ABOUT THE AUTHOR

...view details