యాదాద్రి జిల్లా బొమ్మలరామరం మండలంలోని చీకటిమామిడి గ్రామంలో మొట్టమొదటి రైతు వేదికను ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఆలేరు నియోజకవర్గలో నిర్మాణం అయిన 37 రైతువేదికలలో చీకటి మామిడి రైతువేదికను మోడల్ రైతు వేదికగా నిర్మాణం చేసిన సర్పంచ్ని అభినందించారు.
రైతు వేదికను ప్రారంభించిన ఎమ్మెల్యే గొంగిడి సునీత - yadadri bhuvanagiri latest news
యాదాద్రి భువనగిరి జిల్లా చీకటిమామిడి గ్రామంలో మొట్టమొదటి రైతు వేదికను ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.
రైతు వేదికను ప్రారంభించిన ఎమ్మెల్యే గొంగిడి సునీత
ఈ రైతు వేదిక క్లస్టర్ కింద 11 గ్రామల రైతులు ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. రైతు వేదికల ద్వారా భూ పరీక్షలు చేసి.. రైతులందరూ సమష్టిగా ఏ పంట వేస్తే బాగుంటుందని నిర్ణయం తీసుకునేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.
ఇదీ చదవండి:'ఆ పార్టీలతో కలసి భాజపా విభజన రాజకీయం'