తెలంగాణ

telangana

ETV Bharat / state

బ్లాక్ ఫంగస్ మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం - ఎమ్మెల్యే గాదరి కిశోర్​ కుమార్

కరోనా విపత్కర పరిస్థితుల్లో పలువురు దాతలు వివిధ రూపాల్లో సహాయం అందిస్తూ.. తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. యాదాద్రి జిల్లా మోత్కూరులో బ్లాక్ ఫంగస్​తో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఎమ్మెల్యే గాదరి కిశోర్​ కుమార్ ఆర్థిక సాయం అందజేశారు.

ఎమ్మెల్యే ఆర్థిక సాయం
ఎమ్మెల్యే ఆర్థిక సాయం

By

Published : Jun 17, 2021, 10:15 PM IST

యాదాద్రి జిల్లాలో.. కరోనా బారిన పడి ఆర్థికంగా చితికిపోయిన ఓ కుటుంబానికి ఎమ్మెల్యే గాదరి కిశోర్ అండగా నిలిచారు. మోత్కూరుకు చెందిన రావుల వెంకన్న ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్నాడు. అనంతరం కొద్ది రోజులకే బ్లాక్ ఫంగస్ సోకి మృతి చెందాడు. అతడి భార్యకూ కరోనా సోకి.. ప్రస్తుతం కోలుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే​.. బాధిత కుటుంబానికి రూ. 25 వేల ఆర్థిక సాయంగా అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు.

మృతుడి భార్యకు.. గతంలోనూ స్థానిక పార్టీ కార్యకర్తల చేతుల మీదుగా రూ. 20 వేలను అందించారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శారద, మున్సిపల్ ఛైర్​ పర్సన్ సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:Yadadri Temple: రామలింగేశ్వర ఆలయానికి తుది మెరుగులు

ABOUT THE AUTHOR

...view details