తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులు, కష్టాల్లో కాస్త ఊరట అని ఈటీవీ, ఈటీవీ భారత్ కథనాలకు తుంగతుర్తి ఎమ్మెల్యే స్పందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో చిన్నారులకు రూ.10 వేల సాయం చేశారు. అమ్మాయి పేరుమీద రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నట్లు చెప్పారు. అనాథలకు అండగా ఉంటానని, ఎవరూ లేరని అధైర్య పడొద్దని ఎమ్మెల్యే గాదిరి కిషోర్ భరోసా ఇచ్చారు.
చిన్నారులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే గాదరి కిషోర్ - yadadri bhuvanagiri district latest news
ఈటీవీ, ఈటీవీ భారత్లో వచ్చిన 'తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు' అనే కథనాలకు తుంగతుర్తి ఎమ్మెల్యే స్పందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని చిన్నారులకు రూ.10 వేల సాయం చేశారు.
చిన్నారులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే గాదరి కిషోర్
జడ్పీటీసీ గోరుపల్లి శారద సంతోష్ రెడ్డి.. 25 వేల రూపాయలు డిపాజిట్ చేస్తామని తెలిపారు. స్థానిక సంతోష్ డిగ్రీ కళాశాల యాజమాన్యం అమ్మాయి డిగ్రీ చదువుకు అయ్యే ఖర్చును భరించనున్నట్లు తెలిపింది.
ఇవీ చూడండి: రాయలసీమ ప్రాజెక్టుపై ఏపీ తప్పుదోవ పట్టిస్తోంది: తెలంగాణ