తెలంగాణ

telangana

ETV Bharat / state

'కులవృత్తుల అభివృద్ధికి దోహదపడుతున్న ఏకైక రాష్ట్రం మనదే'

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో జిల్లా పశుసంవర్ధక, మత్య్స శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. తీనం చెరువులో చేపపిల్లలు వదిలారు. పశువుల హెల్త్​ క్యాంపును ప్రారంభించారు. పాడి రైతులతో ముచ్చటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

minister talasani visited bhuvanagiri
minister talasani visited bhuvanagiri

By

Published : Aug 25, 2020, 2:34 PM IST

కులవృత్తులకు చేయూత నివ్వడానికి నిధులు కేటాయించి అభివృద్ధికి దోహదపడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పశుసంవస్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్​ తెలిపారు. భువనగిరి పట్టణంలో పశుసంవర్ధక శాఖ ఏర్పాటు చేసిన పశువుల హెల్త్ క్యాంపును మంత్రి ప్రారంభించారు. పట్టణ శివారులోని తీనం చెరువులో మంత్రి చేపపిల్లలు వదిలారు. పాడి రైతులకు విజయ డైరీ ఆధ్వర్యంలో కిసాన్ క్రెడిట్ కార్డు లోన్ల చెక్కులు పంపిణీ చేశారు. పాడి రైతులతో కాసేపు మాట్లాడారు. పాల ఉత్పత్తి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రికి మత్య్సకారులు ఓ వినతి పత్రాన్ని సమర్పించారు.

భువనగిరి నియోజకవర్గంలోని ని అన్ని చెరువులు కుంటల్లో చేప పిల్లలు పెంచుతామని మంత్రి తెలిపారు. పాడి రైతులకు 4 రూపాయల ఇన్​సెంటివ్​ను ఇస్తున్నామన్నారు. మత్య్సకారులకు వారి సౌకర్యార్థం వాహనాలు సమకూర్చామన్నారు. రెండో దశ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. మూగజీవాలకు హెల్త్ కార్డులను పంపిణీ చేశామని గుర్తు చేశారు. గొల్ల కుర్మలకు మత్స్యకారులకు, ఉపయోగపడే విధంగా త్వరలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు.

ఇదీ చదవండి-సెప్టెంబర్​ 1 నుంచి మెట్రో రైల్​​ సర్వీసులు!

ABOUT THE AUTHOR

...view details