తెలంగాణ

telangana

ETV Bharat / state

'సభ్యత్వ నమోదును పార్టీశ్రేణులు సవాల్​గా తీసుకున్నారు' - 'Membership registration challenged by party leaders'

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్​పోచంపల్లి మండల కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్​లో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి, కర్నె ప్రభాకర్, స్థానిక నేతలు పాల్గొన్నారు.

'సభ్యత్వ నమోదును పార్టీశ్రేణులు సవాల్​గా తీసుకున్నారు'

By

Published : Jul 1, 2019, 5:38 PM IST

సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు సవాల్​గా స్వీకరించాలని భువనగిరి శాసనసభ్యుడు పైళ్ల శేఖర్​రెడ్డి కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్​పోచంపల్లి మండల కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్​లో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పోచంపల్లి మండలంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 ఎంపీటీసీ స్థానాలకు గానూ 9 స్థానాలు గెలుచుకుని సత్తా చాటిందని అదే ఉత్సాహంతో సభ్యత్వ నమోదు విజయవంత చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్​, స్థానిక నేతలు పాల్గొన్నారు.

'సభ్యత్వ నమోదును పార్టీశ్రేణులు సవాల్​గా తీసుకున్నారు'

For All Latest Updates

TAGGED:

bhuvanagiri

ABOUT THE AUTHOR

...view details