తెలంగాణ

telangana

ETV Bharat / state

'మద్యం మత్తులో కాల్వలో పడి వ్యక్తి మృతి' - బీబీనగర్ మండలం

బంధువుల ఇంటికి శుభకార్యానికి వచ్చిన వ్యక్తి తిరుగు ప్రయాణంలో మద్యం మత్తులో కాల్వలో పడి మృతిచెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మద్యం మత్తులో కాల్వలో పడి వ్యక్తి మృతి

By

Published : Jul 17, 2019, 12:15 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామ శివారులోని బునాదిగాని కాల్వలో పడి, వెంకటేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. హైదరాబాద్​కు చెందిన వెంకటేష్ గత శనివారం బ్రాహ్మణపల్లిలోని బంధువుల ఇంటికి శుభకార్యానికి వచ్చాడు. అదేరోజు రాత్రి తన ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణంలో బునాదిగాని కాల్వలో పడిపోయిన విషయాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు.
ఇంటికి చేరుకోకపోవటం వల్ల కుటుంబ సభ్యులు, బంధువులు వెతికినా ప్రయోజనం లేకపోయింది. వెంకటేష్ మృతదేహం కాల్వలో పైకి తేలుతుండటం వల్ల విషయం వెలుగులోకి వచ్చింది. మద్యం సేవించి వాహనం నడపడం వల్లే ఈ​ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

మద్యం మత్తులో కాల్వలో పడి వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details