తెలంగాణ

telangana

18 నుంచి పాతగుట్టలో అధ్యయన, బ్రహ్మోత్సవాలు

యాదాద్రి పాతగుట్ట నారసింహుని అధ్యయనోత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుంచి జరగనున్నాయి. ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆలయ ప్రధాన ఆలయన నిర్వాహకులు నిర్ణయించారు. ఈ మేరకు ఆలయ ఈఓ గీతారెడ్డి.. ప్రధాన పూజారులు, అధికారులతో సమావేశం నిర్వహించారు.

By

Published : Feb 6, 2021, 11:23 AM IST

Published : Feb 6, 2021, 11:23 AM IST

yadadri
యాదాద్రి పాతగుట్ట

యాదాద్రి పుణ్యక్షేత్రానికి అనుబంధమైన పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ వార్షికోత్సవాలు.. సంప్రదాయ పర్వాలతో ఘనంగా జరపాలని ప్రధాన ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం ఈఓ గీతారెడ్డి.. వివిధ విభాగాల ఏఈఓలు, పర్యవేక్షకులు, ప్రధాన పూజారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఏటేటా జరిగే బ్రహ్మోత్సవాలకు ముందస్తుగా అధ్యయనోత్సవాలు నిర్వహిస్తారు. వరుసగా కొనసాగే ఈ ఉత్సవాలు ఈ నెల 18న మొదలవుతాయి. కొవిడ్ నిబంధనల ప్రకారం ఉత్సవాలను చేపట్టాలని నిర్ణయించారు. 18 నుంచి 21 వరకు అధ్యయనోత్సవాలు, 22 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ నిర్వాహకులు, పూజారులు తెలిపారు.

ఇదీ చదవండి:ముగిసిన ధాన్యం కొనుగోళ్లు.. సేకరణలో రికార్డు.!

ABOUT THE AUTHOR

...view details