యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామంలో మిడుతల దండు కలకలం రేపుతోంది. ఒక్కసారిగా వందల మిడుతలు కనపడటం వల్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖైతాపురంలో ఒక వ్యవసాయ బావి దగ్గర చెట్టుపై మిడుతలు ఉండడాన్ని రైతులు గమనించారు. మహారాష్ట్ర నుంచి ఎక్కువ మొత్తంలో మిడుతలు దండుగా వచ్చాయని అన్నదాతలు భావిస్తున్నారు. ప్రస్తుతం పంటలు లేకపోవడం వల్ల మిగతా చెట్లపై వాలి ఒక గంటలోపే పూర్తిగా ఆకులు లేకుండా తినేస్తున్నాయని తెలిపారు.
ఆ గ్రామంలో మిడుతల దండు కలకలం... - yadadri bhuvanagiri district news
యాదాద్రి భువనగిరి జిల్లా ఖైతాపురం గ్రామంలో వందల సంఖ్యలో మిడతలు కనపడటం వల్ల అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో మిడుతలు వచ్చాయని రైతులు భావిస్తున్నారు.
గ్రామంలో మిడుతల దండు కలకలం... ఆందోళనలో రైతులు
ఈ పరిస్థితుల్లో పంటలు వేయాలంటేనే భయంగా ఉందని రైతులు వాపోతున్నారు. సమాచారం అందుకున్న వ్యవసాయ అధికారులు మాత్రం ఇవి ఇక్కడి మిడుతలేనని, మిడుతల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, అయినా కూడా రైతులు జాగ్రత్తలు వహించి వేపనూనె పిచికారీ చేయించుకోవాలని సూచిస్తున్నారు.
ఇవీ చూడండి: నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టురట్టు